సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ అర్రూరి సైదులు(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెన్ పహాడ్ మండలం, ధర్మగ్రామానికి చెందిన సైదులు తన వ్యవసాయ పొలం వద్ద ఈ రోజు ఉదయం ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. 2004 బ్యాచ్ కి చెందిన సైదులు సూర్యాపేటలో రెంట్ కు ఉంటూ ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: జస్ట్ రూ.400తో అయోధ్యకు వెళ్లండి.. ఇలా..
ఇది కూడా చదవండి: ఆడవారికి షాక్.. ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్