Homeహైదరాబాద్latest Newsవిమానాశ్రయాన్ని తలదనేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ నిర్మణం..!

విమానాశ్రయాన్ని తలదనేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ నిర్మణం..!

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడి నుంచి చాలా రైళ్లు నడుస్తున్నాయి. రూ.428 కోట్లతో అత్యాధునిక వసతులు, సకల సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను చూసి చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ రైల్వేస్టేషన్‌ అచ్చం విమానాశ్రయాన్ని పోలి ఉంటుందన్నారు. ఈ రైల్వే స్టేషన్‌ను నవంబర్ 30న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించాల్సి ఉంది, కానీ అది వాయిదా పడింది. ఈ స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త టెర్మినల్ ప్రారంభమైన తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో రద్దీ తగ్గుతుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఏర్పాటు చేశారు.

Recent

- Advertisment -spot_img