Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. మొదట వారికే ఇళ్లు!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. మొదట వారికే ఇళ్లు!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మరోసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది. జాబితాలో అనర్హుల పేర్లను తొలగించాలని సూచించింది. దరఖాస్తులను 3 కేటగిరీలుగా (L1, L2, L3) విభజించింది. L1లోకి సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వాళ్లు, L2లోకి స్థలం, ఇళ్లు రెండూ లేని వాళ్లు, L3లోకి అద్దె/రేకులు/పెంకుటిళ్లలో ఉన్నవారు వస్తారు. తొలి దశలో L1 కేటగిరీ వారికి ఇళ్లు మంజూరు చేస్తారని సమాచారం.

Recent

- Advertisment -spot_img