Homeజిల్లా వార్తలునిరుపేద యువతికి వివాహానికి పుస్తె మట్టెలు తో పాటు దాతల సహకారం

నిరుపేద యువతికి వివాహానికి పుస్తె మట్టెలు తో పాటు దాతల సహకారం

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద కొమ్మట వినోద రాజయ్య కూతురు బహుశా వివాహం ఈనెల 18వ తేదీన ఉన్నందున గూడెం గ్రామానికి చెందిన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ రావులు వధువుకు పుస్తె మట్టెలు చీర అందించారు. అలాగే చిప్పలపల్లి గ్రామానికి చెందిన పురం శ్రీనివాస్ రెడ్డి 50 కేజీల సన్న బియ్యంను సిలివేరి స్వామి, 50 కేజీల సన్న బియ్యం కు డబ్బులు ఇవ్వగా, గాడిచర్ల కిషన్ తండ్రి రాజ మల్లయ్య 50 కేజీల సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చారు,. తాడేపు ఎల్లం 25 కేజీల సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చారు. పుస్తమట్టెలు అందించిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు కు ధన రూపేనా వస్తు రూపేనా అందించిన దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాడేపు జ్యోతి ఎల్లం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోమటి రాజమల్లు, సింగిల్ విండో డైరెక్టర్ గాడిచర్ల రామచంద్రం, గాడిచర్ల కిషన్ సిలివేరి స్వామి, గాడిచర్ల భరత్ కొమ్మటి శ్రీనివాస్, పొన్నాల లింగం సుద్దాల, బాలయ్య, మల్లయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img