

వనపర్తి, ఇదేనిజం : సింగిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వనపర్తి నియోజకవర్గంలోని 100 మంది నిరుపేద 8,9,10 తరగతి ఎస్సీ, ఎస్టీ బాలికలకు సైకిళ్లను పంపిణీకి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చదువుపట్ల విద్యార్థినులకు ఆసక్తి పెంచాలి అన్నారు. అలాగే ఆడపిల్లల పట్ల చూసే వివక్ష పోవాలన్నారు. అందరితో సమానంగా వారు స్వేచ్చను పొందాలని ఆకాంక్షించారు. గురుకుల పాఠశాలలతో తెలంగాణలో విద్యావ్యవస్థ మారిందన్నారు. సన్నబియ్యం అన్నంతో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు ఆదరణ పెరిగిందని, రేపటి పౌరుల భవిష్యత్ కోసం కేసీఆర్ వినూత్న పథకాలు అన్నారు. బాలికలకు హెల్త్ కిట్లు దేశానికే ఆదర్శం అన్నారు మంత్రి.

