Diabetes : డయాబెటిస్‌ను ఈ సింపుల్ డైట్‌తో కట్టడి చేయండి
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్(Diabetes) లేదా షుగర్ వ్యాధి బారినపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
భారత్‌లో కూడా కోట్లాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
అన్ని దేశాల్లో కల్లా భారత్‌లోనే ఎక్కువమంది టైప్ 2 డయాబెటిస్(Diabetes) రోగులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అత్యధిక డయాబెటిస్ రోగులతో ప్రపంచ మధుమేహ రాజధానిగా ఇండియా పేరు తెచ్చుకుంటోంది.
ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ తో 69 మిలియన్ల భారతీయులు బాధపడుతుండగా ఆ సంఖ్య 2040 నాటికి 140 మిలియన్లకు చేరుకునే ప్రమాదం ఉంది.
అధిక శరీర కొవ్వు, పొత్తికడుపు కొవ్వు, ప్యాంక్రియాటిక్ కొవ్వు వంటి వాటి వల్ల భారతీయులలో జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు ప్రబలుతున్నాయి.
డయాబెటిస్ బారిన పడుతున్నామని తెలిసేలోపే చాలామంది మధుమేహులుగా మారుతున్నారు.
భారీ సంఖ్యలో ప్రజలు మధుమేహం బారిన పడటానికి అవగాహన లోపమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.
వైద్య నిపుణుల ప్రకారం సరైన ఆహారంతో షుగర్ వ్యాధి దరి చేరకుండా చెక్ పెట్టొచ్చు.
ఇప్పటికే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు కూడా సరైన ఆహారంతో ఉపశమనం పొందవచ్చు.
మరి ఆ సరైన ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కార్బోహైడ్రేట్లు ప్లస్ ప్రోటీన్
కార్బోహైడ్రేట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి కావు అని భావిస్తుంటారు.
కానీ కార్బోహైడ్రేట్లను పూర్తిగా వదులుకోవలసిన అవసరం లేదు.
కాకపోతే ఆహార విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది.
హోల్‌వీట్ ఆటా పిండి, గోధుమ రవ్వ, జొన్న/ జోవర్, రాగి, బజ్రా, బ్రౌన్ రైస్ వంటివి రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి.
అందువల్ల వీటిని తినడం పూర్తిగా శ్రేయస్కరం.
ప్రోటీన్‌తో కలిపి కార్బోహైడ్రేట్లను తింటే గ్లూకోజ్ మరింత నెమ్మదిగా విడుదల అవుతుంది.
అలాగే కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
చిట్కా: గోధుమ పిండి లేదా ఆటాతో జోవర్, బజ్రా, బేసన్ వంటి పిండిని కలపి రోటీ చేయండి.
చక్కెర విషయంలో జాగ్రత్త
తీపి పదార్థాలు మాత్రమే షుగర్ వ్యాధికి కారణం అనేది ఒక అపోహ మాత్రమే.
కానీ చక్కెర విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే అత్యధిక కొవ్వు కలిగి ఉన్న ఆహార పదార్థాల్లో తీపి ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
కొవ్వు, తీపి రెండూ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తింటే.. అది మన శరీర బరువును పెంచుతుంది.
తద్వారా మన రక్తంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది.
ప్రొటీన్ ఎక్కువగా తీసుకోండి
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లను తీసుకోవడమే ఎంత ముఖ్యమో.. హెల్దీ ప్రొటీన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
మన ఆహారంలోని ప్రొటీన్ ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
అయితే ప్రొటీన్ పుష్కలంగా లభించే కొన్ని ఆహార పదార్థాల్లో కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి.
కాబట్టి కొవ్వు అధికంగా లేని.. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలేంటో తెలుసుకోవాలి.
పొత్తి కడుపులో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆహారంలో ప్రొటీన్ సరిపడా లభించకపోతే.. మీరు ప్రతి సర్వ్‌కు 8-10 గ్రాముల ప్రొటీన్ సప్లిమెంట్‌ను తీసుకోవచ్చు.
ప్రొటీన్‌తో బరువు తగ్గండి
అధిక బరువు ఉండటం వల్ల టైప్ 2 డయాబెటిస్ సైడ్ ఎఫెక్ట్స్ వేధించే అవకాశం ఉంది.
ప్రతిరోజు శారీరక శ్రమ చేయడం ద్వారా 5 నుంచి 10 శాతం బరువు తగ్గాలి.
పొత్తి కడుపు భాగంలో ఉన్న కొవ్వు బాగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
బరువు తగ్గడం వల్ల షుగర్ వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు.
ఒత్తిడి (Diabetes)
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అడ్రినలిన్, నోరాడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి.
ఈ ఒత్తిడి మిమ్మల్ని రోజుల తరబడి వేధిస్తుంటే మధుమేహం మరింత తీవ్రమవుతుంది.
అధిక బరువు పెరగడానికి కూడా ఒత్తిడి కారణం కావచ్చు.
అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని కోరికను ఒత్తిడి పెంచుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది.
ఒత్తిడి ప్రేరిత కోరికలను తగ్గించడానికి అధిక ప్రోటీన్ స్నాక్స్ లేదా పానీయాలు మాత్రమే తీసుకోవాలి.
వ్యాయామం (Diabetes)
ఎవరైతే వారానికి నూట ముప్పై నిముషాలు వ్యాయామం చేస్తారో వారు టైప్ 2 డయాబెటిస్ ని చక్కగా మేనేజ్ చేయగలరు.
భోంచేసిన తర్వాత కేవలం పది నిమిషాలు నడిచిన బ్లడ్ షుగర్ లెవెల్స్ 22 శాతం తగ్గాయని అధ్యయనాల్లో తేలింది.
అందుకే రోజుల్లో తరచూ నడవడం చాలా ముఖ్యం.