Homeహైదరాబాద్latest Newsహర్దిక్‌ కెప్టెన్సీపై ముదురుతోన్న వివాదం

హర్దిక్‌ కెప్టెన్సీపై ముదురుతోన్న వివాదం

ఇదేనిజం, స్పోర్ట్స్ డెస్క్ : సన్‌రైజర్స్ చేతిలో ఓటమి కారణంగా హర్దిక్‌పై విమర్శలు, ట్రోల్స్ ఎక్కువయ్యాయి. కెప్టెన్‌గా ప్రైమ్ బౌలర్ బుమ్రాను ఉపయోగించుకున్న తీరును తప్పుబడుతున్నారు. పవర్‌ప్లేలో ఓ వైపు ట్రేవిస్ హెడ్, అభిషేక్ షర్మ సిక్సర్ల మోత మోగిస్తుంటే బుమ్రాకు ఒక్క ఓవర్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. డెత్ ఓవర్లలోనూ పొదుపుగా బౌలింగ్ చేసేలా తగిన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడనేది వాస్తవం. బంతిని అలవోకగా బౌండరీ దాటించే సత్తా ఉన్నా కీలక సమయంలో చేతులెత్తేస్తున్నట్లు విమర్శిస్తున్నారు. గత మ్యాచ్‌లోనూ విజయానికి 4 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన తరుణంలో చెత్త షాట్ ఆడి పెవిలియన్ బాట్ పట్టాడు.

హర్దిక్ చెత్త కెప్టెన్సీ వల్లే SRH భారీ స్కోరు సాధించిందని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్లుగా జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రోహిత్ సలహాలు తీసుకుంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇకనుంచైనా హర్దిక్ కెప్టెన్సీలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. ఫలితం ఏదేమైనా ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షానికి క్రికెట్ అభిమానులు తడిసి ముద్దయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే పలు రికార్గులు బద్దలయ్యాయి..అవి మీకోసం

Highest team totals in the IPL
277/3 – SRH vs MI, Hyderabad, 2024
Highest boundary count (4s+6s) in an IPL match
69 – CSK vs RR, Chennai, 2010
69 – SRH vs MI, Hyderabad, 2024
Most sixes in team innings in the IPL
21 – RCB vs PWI, Bengaluru, 2013
20 – RCB vs GL, Bengaluru, 2016
20 – DC vs GL, Delhi, 2017
20 – MI vs SRH, Hyderabad, 2024
Most sixes in a Men’s T20 match
38 – SRH vs MI, Hyderabad, IPL 2024
Most sixes in an IPL game
38 – SRH vs MI, Hyderabad, 2024
Highest aggregates in an IPL match
523 – SRH vs MI, Hyderabad, 2024
500-plus aggregate in a Men’s T20 match
523 – SRH vs MI, Hyderabad, IPL 2024
Highest second-innings totals in the IPL
246/5 – MI vs SRH, Hyderabad, 2024 (Lost)

Recent

- Advertisment -spot_img