– కెనడా తీరుపై భారత దౌత్యవేత్త సంజయ్ ఫైర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు కొలిక్కిరాకముందే భారత్‌ను ఎలా దోషిని చేశారంటూ దోషిని చేశారంటూ భారత దౌత్యవేత్త సంజయ్ కెనడా తీరుపై ఫైర్ అయ్యారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కేసు విషయంలో కెనడా తీరుపై భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మ ఫైర్ అయ్యారు. దర్యాప్తు కొలిక్కిరాకముందే భారత్‌ను దోషిని చేశారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ట్రూడో చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ‘ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. హత్యకేసులో దర్యాప్తు ఒక కొలిక్కి రాకముందే భారత్‌ను దోషిగా నిర్ధారణ చేశారు. ఇదేనా చట్ట పాలనా..?’ అని సంజయ్ కుమార్ వర్మ అన్నారు. ‘భారత్‌ను విచారణకు సహకరించమని అడుగుతున్నారు. క్రిమినల్ టర్మినాలజీ గమనిస్తే.. ఎవరినైనా విచారణకు సహకరించమని అడిగితే, వారు అప్పటికే దోషి అని అర్థం’ అని వ్యాఖ్యానించారు.