కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు దృవీకరించారు. పాజిటీవ్ వచ్చిన వారందరినీ ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. ఇటీవల ఖైదీల నుంచి స్వాబ్ నమూనాలు సేకరించి పరిక్షించడంతొ 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది పరిసర ప్రాంతాలను ద్రావకంతో శుభ్రం చేయించారు.