Homeఅంతర్జాతీయంఎవరెస్ట్ ఎక్కిన కరోనా

ఎవరెస్ట్ ఎక్కిన కరోనా

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న ఒక వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణ అయింది.

కొన్ని వారాల ముందే ఎవరెస్ట్ పర్వతాన్ని పర్వతారోహకుల కోసం తెరిచారు.

నార్వేకు చెందిన అధిరోహకుడు ఎర్లెండ్ నెస్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్థరణ కావడంతో ఎనిమిది రోజులు ఐసొలేషన్‌లో ఉంచారు.

నెస్ బృందంలో ఒక షెర్పాకు కూడా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

నేపాల్‌కు ఇది పెద్ద దెబ్బే. ఎవరెస్ట్ యాత్రల వల్ల ఆ దేశానికి అధిక ఆదాయం లభిస్తుంది.

నెస్‌కు ఈ వైరస్ ఎలా సోకిందో తెలీదుగానీ ఖుంబు లోయలో టీ తాగడం కోసం ఆగినప్పుడు ఆ దుకాణాల దగ్గరే సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

“నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉంటూ, కోవిడ్ నిబంధనలను మరింత కఠినంగా పాటించవలసింది. ట్రెక్‌లో ఎక్కువమంది మాస్క్ పెట్టుకోలేదు” అని నెస్ చెప్పారు.

పర్వతం ఎక్కుతుండగా నెస్ అనారోగ్యం పాలయ్యారు. ఆరు రోజులు అక్కడే అవస్థ పడ్డారు. తరువాత ఏప్రిల్ 15న ఆయనను హెలికాప్టర్‌లో నేపాల్‌లోని కాఠ్‌మండూ తరలించారు.

కాఠ్‌మండూలో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా నెస్‌కు కోవిడ్ సోకినట్లు నిర్థరణ అయింది.

అయితే, ఆయన త్వరగానే కోలుకున్నారు. ఏప్రిల్ 22న చేసిన టెస్టుల్లో కోవిడ్ నెగటివ్ వచ్చింది.

ఈ ఏప్రిల్‌లో అనేకమంది విదేశీయులు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

మహమ్మారి కారణంగా అధిరోకులకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఏడాదిపాటూ మూసి వేశారు.

ఎవరెస్ట్ పర్వతారోహణ ద్వారా నేపాల్‌కు సంవత్సరానికి 4 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని కాఠ్‌మండూ పోస్ట్ తెలిపింది.

ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించేందుకు 72 గంటల లోపల కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగటివ్ రిపోర్ట్ చూపిస్తేనే నేపాల్‌లోకి అనుమతిస్తారని ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది.

Recent

- Advertisment -spot_img