Homeతెలంగాణ"మనం సైతం" కాదంబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా టెస్టులు

“మనం సైతం” కాదంబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా టెస్టులు

“మనం సైతం” కాదంబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి ఈటెల రాజేంద్ర సహకారంతో సినీ కార్మికులకు, జూనియర్ ఆర్టిస్టు ఆఫీస్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 45 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో ముగ్గురికి పోజిటివ్ వచ్చింది. ఈ సందర్బంగా కాదంబరీ ఫౌండేషన్​ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్​ మాట్లాడుతూ మన జీవన శైలి మరింత కఠినం చేసుకుందాం! మరింతగా ముందు జాగ్రత్తలు తీసుకుందాం! కరోనాను మన రాష్ట్రం నుంచి తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. కోవిడ్​ నిబంధనలను కఠినంగా పాటిస్తూ ఇంటివద్దే క్షేమంగా ఉండాలని సూచించారు కిరణ్​. ఈ కార్యక్రమంలో వినోద్ బాల, వల్లభనేని అనిల్, పీఎస్​ఎన్​ దొర,  ఎన్​ అనిత, సీసీ శ్రీను, వీ సురేష్, టీం కృషిచేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img