Homeలైఫ్‌స్టైల్‌Kadaknath Hens : ‘కడక్‌నాథ్’కు భారీ డిమాండ్

Kadaknath Hens : ‘కడక్‌నాథ్’కు భారీ డిమాండ్

Huge demand for Kadaknath Hens : ‘కడక్‌నాథ్’కు భారీ డిమాండ్.. కరోనా కాలంలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రజలు ప్రయారిటీ ఇస్తున్న విషయం తెలిసిందే.

తల నుంచి తోక వరకు రక్తంతో సహా నల్లగా ఉంటూ ఎంతో ప్రత్యేకత కలిగిన కడక్‌నాథ్‌ కోడి మాంసం రోగ నిరోధకశక్తికి అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో ఆ కోళ్ల మాంసానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది.

కొవ్వు శాతం తక్కువ.. విరివిరిగా ప్రొటీన్ల లభ్యత.. గుండె, శ్వాస సంబంధ సమస్యలతో, రక్తహీనతతో బాధపడేవాళ్లకు కడక్‌నాథ్‌ కోడి మాంసం ఎంతో శ్రేష్టమైంది.

లాక్‌డౌన్ సమయంలో వాటికి కాస్త డిమాండ్ తగ్గినప్పటికీ, అన్‌లాక్‌ ప్రారంభమైన దగ్గరి నుంచి మళ్లీ కడక్‌నాథ్‌ కోళ్లకు డిమాండ్ పుంజుకుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

ఝబువా జిల్లాలో ఈ రకం కోళ్ల లభ్యత ఎక్కువ. పౌల్ట్రీ ఫామ్ యజమానుల ఆదాయం పెరిగేలా చూసేందుకు, వాటి ఉత్పత్తి, అమ్మకాలను పెంచే ప్రణాళికను రూపొందించినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వినియోగదారులు ఈ చికెన్‌ వైపు మొగ్గు చూపుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

కొవిడ్‌కు సంబంధించి వీటిపై ప్రత్యేకమైన పరిశోధనలు ఏమీ చేయనప్పటికీ, వాటి రోగ నిరోధకతక శక్తిపై ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉందని ఝబువాకు చెందిన కృషి విజ్ఞానకేంద్రం అధికారి అన్నారు.

అదే జిల్లాకు చెందిన ఓ సహకార సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. మహమ్మారి సమయంలో కోడి మాంసానికి డిమాండ్ పెరిగిందన్నారు. నలుపు రంగు కారణంగా ఈ చికెన్‌ను స్థానికులు ‘కాలామసి’ అని పిలుస్తుంటారు.

ఇదిలా ఉండగా, ఝుబువాకు చెందిన కడక్‌నాథ్ చికెన్‌కు గతేడాది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img