Homeహైదరాబాద్latest Newsమియాపూర్ లో ఎఫ్3 ఫుడ్ కోర్ట్స్ ప్రారంభించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

మియాపూర్ లో ఎఫ్3 ఫుడ్ కోర్ట్స్ ప్రారంభించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఇదేనిజం, శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. మెయిన్ రోడ్డు సమీపంలో అందరికీ అందుబాటులో అన్ని రకాల రుచులతో ఏర్పాటు చేసిన “F3” ఫుడ్ కోర్ట్స్ లో అన్ని సదుపాయాలు ఉన్నట్లు కాఫీ ,టీ బిర్యానీ పలావ్, ఐస్ క్రీమ్స్ ,కూల్ డ్రింక్స్ బాదంపాలు అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రత్యేక రుచులతో అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతేకాకుండా గేమింగ్ క్లబ్ కూడా ఏర్పాటు చేశామని మరోవైపు కిడ్డీ పార్టీల చేసుకోవడం కోసం ప్రత్యేకమైన హాల్ నిర్మించామని ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. చక్కటి ఆహ్లదకరమైన వాతావరణంలో ప్రజలందరికీ నాణ్యమైన రుచికరమైన వటంకలను అందిస్తూ, వినియోగదారుల ఆధరాభిమానాలు పొందాలని సూచించారు. యువత స్వయం ఉపాధి రంగంలో ఇలాంటి వ్యాపార రంగాలను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు క్రాంతి , వివేక్, సంతోష్ ముదిరాజ్, స్థానిక నాయకులు జాంగిర్, హనుమంతరావు, శివ ముదిరాజ్, సుధీర్, పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img