భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్ తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఏడాది తర్వాత ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. రోహిత్ శర్మకు సంబంధించి ఓ కీలక విషయాన్ని టీమ్‌ఇండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
తను ఎవరితోనూ సాధారణంగా గొడవ పడేందుకు ఇష్టపడనని, త్వరగా వాగ్వాదానికి వెళ్లనని.. కానీ, 2012లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం ఇబ్బంది పెట్టిందన్నాడు. ఆ సమయంలో రోహిత్, మనోజ్ తివారీతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు, అక్కడి భారత అభిమానులే తమను దూషించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థంకాలేదు. అప్పటి వరకు ఓర్పుగా ఉన్న రోహిత్ ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి దగ్గరకు వెళ్లాడు. నేను కూడా రోహిత్ శర్మ పక్కనే ఉన్నానని.. మనవాళ్లే మమ్మల్ని దుర్భాషలాడటం తీవ్రంగా బాధించింది’’ అని ప్రవీణ్ తెలిపాడు. ఓ అభిమాని మద్యం తాగి వచ్చి పంజాబీలో మాట్లాడాలంటూ రోహిత్‌తో గొడవ పడుతున్నట్లు ఆ ఘటన వీడియోలో ఉంది. ఆ సమయంలో ప్రవీణ్ కొంచెం ఘాటుగానే స్పందించానన్నాడు.