Homeహైదరాబాద్latest Newsమున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం

మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనైనది. మొత్తం 22 అంశాలు కు ఆమోదం లభించింది. ప్రధానంగా ఇట్టి సమావేశంలో కమలాపూర్ ఇందిరమ్మ,నక్కలపెట ఇందిరమ్మ కాలనీ మరియు వివిధ వార్డులలో ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, వార్డులలో కొత్త మోటార్ కొనుగోలు, హరిత హారంలో భాగంగా మొక్కలు నాటుటకు లేబర్స్ ను ఎంగేజ్, యనిమాల్ బర్త్ సెంటర్ ఏర్పాటు,సానిటేషన్ వాహనాలకు జిపిఎస్ సిస్టమ్ ఏర్పాటు,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జీతము పెంపు, బస్తీ దవాఖాన కు స్థల కేటాయింపు గురించి, ఫాగింగ్ మిషన్ కొనుగోలు, పిచ్చి మెక్కలను తొలగించుటకు గ్రాస్ కట్టర్ కొనుగోలు,మార్చ్ -2024 నుండి జూన్ -2024 మాసములకు సంబంధించిన ఆదాయ వ్యయాలు వివరములు మరియు ఇతర బిల్లులు చెల్లింపు చేయుటకు మొత్తం 22 అంశాల గాను 22 అంశాలను ఆమోదించడం జరిగింది.ఇట్టి సమావేశంలో ,మున్సిపల్ కమీషనర్ యం. శ్రీనివాస్ రెడ్డి ,వైస్ ఛైర్మన్ ఇందారపు రామన్న , కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ జె.ఎ.ఓ గణేష్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ , బి. గంగాధర్ మేనేజర్ , సి.హెచ్. గంగాధర్ సానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Recent

- Advertisment -spot_img