యూపీలోని సంభాల్ జిల్లాలో షాకింగ్ సంఘటన జరిగింది. గురువారం అర్థరాత్రి OYO హోటల్ కి శివమ్(20) అనే యువకుడు స్వీటీ అనే అమ్మాయి (23) వెళ్లారు. శుక్రవారం చాలా సేపటికి వారిద్దరూ బయటకి రాకపోవడంతో హోటల్ మేనేజర్ కిటికీ తెరిచి చూడగా.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువతి విషం తాగి, ప్రియుడు ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.