Homeహైదరాబాద్latest Newsచెరువులో జంట మృతదేహాలు : Crime News

చెరువులో జంట మృతదేహాలు : Crime News

ఇదేనిజం, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని వెంగళరావు నగర్ కాలనీ సమీపంలో ఉన్న బాబన్ సాబ్ దర్గా చెరువులో సోమవారం రెండు మృత దేహాలను పోలీసులు గుర్తించారు. మృతులను అమృతపూర్ గ్రామానికి చెందిన పెద్ద బాబయ్య (50), పోశమ్మ (45)గా గుర్తించారు. వారు స్థానిక దర్గా వద్ద ఉంటూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వాళ్లు చెరువులో ఎలా పడిపోయారు? అన్ని విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img