Homeఆంధ్రప్రదేశ్Car టాప్​పై జంట Romance

Car టాప్​పై జంట Romance

– హైదరాబాద్​లో అర్ధరాత్రి ఘటన
– సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇదే నిజం, హైదరాబాద్: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వాహనాలపై కొందరు ఆకతాయిలు హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ యువ జంట రోమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శంషాబాద్​నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెక్ వంతెనపై కారుపైనే కూర్చొని ముద్దులు పెట్టుకున్నారు. రోడ్లపై తిరుగుతున్నామనే విషయాన్ని కూడా మరచిపోయి కౌగిలించుకొని విన్యాసాలు చేస్తూ ప్రమాదకర రీతిలో ప్రయాణించారు.

ఈ ముద్దుల వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిని చూసిన నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యతని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే యువతులతో కలిసి ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తూ కొందరు యువకులు.. రాజధాని రహదారులపై బెంబేలెత్తించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img