Court:చట్ట ప్రకారం ఎవరైనా తమకు అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో లేదా నేరుగా కోర్టులో కేసు పెట్టవచ్చు .అయితే ఆ కేసు తీరా ఛార్జి షీటుగా మారి సంబంధిత కోర్టులు విచారణకు వచ్చినప్పుడు అట్టి ఫిర్యాది దారుడు తాను మొదట కేసు పెట్టినప్పుడు ఇచ్చిన స్టేట్ మెంట్ కు భిన్నంగా పోరాదు. ఆలా ఇచ్చిన స్టేటుమెంట్ ను తానే మార్చేసి నిందితుని పక్షాన చేరితే ఏమవుతుంది? . అది ముమ్మాటికి ఐపీసీ లో నేరమే . కేవలం ఫిర్యాది మాత్రమే కాదు కేసులో ఇతర సాక్షులు ఎవరైనా సరే పూర్తి అవగాహనతో కేసులో తప్పుడు సాక్షాలు ఇచ్చి దర్యాప్తు సంస్థలను లేదా న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తే అది నేరమే. దానిని తప్పుడు సాక్ష్యం (perjury ) గా భావించి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ ) 193 సెక్షన్ కింద కేసు పెట్టి కోర్టులో విచారణ జరుపుతారు . దానికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు .
ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నామంటే ఏసీబీ కేసులో ఫిర్యాది దారుడికే జైలు శిక్ష పడిన చిత్రమైన పరిస్థితి . ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ నాంపల్లి కోర్టులో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళ్తే 2007 లో సికింద్రాబాద్ కు చెందిన పి .నర్సింగ్ తనను లంచం డిమాండ్ చేసిన ఒక పోలీస్ అధికారిని డబ్బులు ఇచ్చి ఏసీబీకి పట్టించాడు , అయితే తీరా ఆ కేసు ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే సరికి తాను సాక్ష్యం ఇవ్వడం లో పూర్తిగా భిన్నవైఖరి ప్రదర్శించాడు . నిందితునికి అనుకూలంగా తన సాక్ష్యం ఇచ్చాడు . కోర్ట్ పరిభాషలో దాన్ని hostile అయ్యాడు అంటారు . నర్సింగ్ సాక్ష్యం మీద ఆ పోలీస్ అధికారి మీద పెట్టిన ట్రాప్ కేసు ను కోర్టు 2016 లో కొట్టి వేసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న ఏసీబీ కోర్ట్ నర్సింగ్ ది తప్పుడు సాక్ష్యంగా పరిగణించి C.M.M కోర్ట్ నాంపల్లి లో కేసును ఫైల్ చేశారు .
ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఏసీబీ కేసులో ఫిర్యాదిదారుడైన నర్సింగ్ ను తప్పుడు సాక్ష్యం కేసులో దోషిగా పరిగణిస్తూ రెండేళ్ల కారాగార శిక్ష , మూడు వేల రూపాయల జరిమానా విధించింది . ఈ కేసును ఉదాహరణగా చూపిస్తూ కోర్టులో కేసుల విచారణ సమయంలో నిందితులతో రకరకాల కారణాలతో లాలూచీపడి hostile అయ్యే సాక్షులను తస్మాత్ జాగ్రత్త అంటున్నారు