Court Movie : రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియాదర్శి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ”కోర్ట్”. ఈ సినిమా మార్చి 14న విడుదలై ఘన విజయం సాధించింది. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వధ భారీ కలెక్షన్స్ రాబెటింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఏప్రిల్ 11, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌లో నాన్-ఇంగ్లిష్ కేటగిరీలో 5వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా తొలి ఐదు రోజుల్లో 22 లక్షల వ్యూస్, 54 లక్షల గంటల వ్యూయింగ్ టైమ్ సాధించింది.ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ సినిమా పోక్సో చట్ట దుర్వినియోగంపై కథనం సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.