Court Movie : నేచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా సినిమాలో నటిస్తూనే మరోవైపు కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ మంచి హిట్లు కొడుతున్నాడు. ఈ క్రమంలోనే నాని మరో కొత్త సినిమాని నిర్మించాడు. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియాదర్శి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ”కోర్ట్”. ఈ సినిమా మార్చి 14న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాని కేవలం 10 కోట్లతో నిర్మించారు. కానీ ఈ సినిమా 10 రోజుల్లో 50 కోట్లు కలెక్షన్స్ రాబెట్టింది. దీనికి సంబంధించిన అధికారక పోస్టర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.