Homeజాతీయం#Covaxin #Children : పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్ ప్రారంభం

#Covaxin #Children : పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్ ప్రారంభం

బిహార్‌ రాజధాని పాట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ కరోనా టీకా ట్రయల్స్‌ పిల్లలపై ప్రారంభమయ్యాయి.

15 మంది పిల్లలను ట్రయల్స్‌ కోసం ఎంపిక చేయగా.. అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి వ్యాక్సిన్‌ వేశారు.

సుమారు వంద మందిపై ట్రయల్స్‌ నిర్వహించాల్సి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సీఎం సింగ్‌ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు 108 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, స్క్రీనింగ్‌ అనంతరమే వ్యాక్సిన్‌ వేస్తామన్నారు.

ట్రయల్స్‌లో ఇంట్రామాస్కులర్‌ విధానంలో 0.5 ఎం.ఎల్‌ మోతాదు ఇచ్చామని, అనంతరం వారిని రెండు గంటలు పరిశీలినలో ఉంచినట్లు చెప్పారు. తొలి డోసు ఇచ్చిన తర్వాత పిల్లల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని చెప్పారు.

రెండు నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లల్లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

కొవాగ్జిన్‌ టీకాను భారత్‌ బయోటెక్‌ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సహాయంతో అభివృద్ధి చేసింది.

పిల్లలపై ట్రయల్స్‌ పాట్నా, ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో జరుగుతున్నాయి.

వ్యాక్సిన్‌ హోల్‌ విరియన్‌ ఇనాక్టివేటెడ్‌ వెరో సెల్‌ డెరైవ్డ్‌ ప్లాట్‌ ఫామ్‌ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వీ, కొవాగ్జిన్‌ టీకాలను దేశంలో 18 ఏళ్లుపైబడిన వ్యక్తులకు టీకా డ్రైవ్‌లో పంపిణీ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img