HomeతెలంగాణCovid compensation : కొవిడ్‌ పరిహారాన్ని మంజూరు చేసే అధికారం కలెక్టర్లకు

Covid compensation : కొవిడ్‌ పరిహారాన్ని మంజూరు చేసే అధికారం కలెక్టర్లకు

Covid compensation power is under collector : కొవిడ్‌ పరిహారాన్ని మంజూరు చేసే అధికారం కలెక్టర్లకు

కొవిడ్‌తో మరణించినవారి కుటుంబ సభ్యులకు పరిహారాన్ని(Covid compensation) మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.

ఇప్పటికే దరఖాస్తు విధానం, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం పరిహారాన్ని ఆమోదించి, విడుదల చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ముందుగా మృతుల కుటుంబ సభ్యులు పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి తీసుకున్న మరణ ధ్రువీకరణ పత్రానికి కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టును జత చేసి కొవిడ్‌ మరణ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి.

పాజిటివ్‌ రిపోర్టు లేకుంటే చికిత్స తీసుకున్న దవాఖాన నుంచి ‘మెడికల్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్‌’ (మరణ కారణాన్ని నిర్ధారించే పత్రం) జత చేయాలి.

ఆ సర్టిఫికెట్‌ కూడా లేకపోతే కరోనా చికిత్స సమయంలో నిర్వహించిన పరీక్షలు, మెడికల్‌ బిల్లులు సమర్పించాలి.

ఈ వివరాలను కొవిడ్‌ మరణాలను నిర్ధారించేందుకు ప్రభుత్వం ఇటీవల కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి మెంబర్‌ కన్వీనర్‌గా, హెడ్‌క్వార్టర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ మెంబర్‌గా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలించి కొవిడ్‌ డెత్‌ సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తుంది.

ఆ సర్టిఫికెట్‌కు బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు, ఇతర ధ్రువపత్రాలు జత చేసి పరిహారం కోసం మరోసారి మీసేవ కేంద్రం నుంచి దరఖాస్తు చేయాలి.

కలెక్టర్లు వాటిని పరిశీలించి, అర్హత ఉన్నవాటిని ఆమోదించి 30 రోజుల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.50 వేల పరిహారాన్ని అందిస్తారు.

డబ్బు వారి ఆధార్‌ నంబర్‌కు అనుసంధానించిన బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది.

ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం

హైదరాబాద్‌, నవంబర్‌ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా బారినపడి మృతిచెందిన హెల్త్‌వర్కర్ల కుటుంబాలకు కేంద్రం నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నది.

రాష్ట్రంలో 73 కుటుం బాల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున జమచేసింది.

తెలంగాణలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు సహా క్యాడర్‌ స్టాఫ్‌ మొత్తంగా 109 మంది హెల్త్‌వర్కర్లు కరోనాతో మృతి చెందారు.

అందులో 73 మందికి పరిహారం వచ్చిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img