Homeక్రైంరూ.10ల‌క్ష‌లు క‌ట్టించుకోని.. వేరే శ‌వాన్ని అప్ప‌గించారు

రూ.10ల‌క్ష‌లు క‌ట్టించుకోని.. వేరే శ‌వాన్ని అప్ప‌గించారు

హైదరాబాద్‌: క‌రోనా కాలంలో ప్రైవేట్ ఆస్ప‌త్రుల అరాచ‌కాల‌కు అంతులేకుండా పోతోంది. క‌రోనాకు చికిత్స అందించే కొన్ని ఆస్ప‌త్రుల తీరును స్వ‌యానా హైకోర్టుల ఆక్షేపించినా వాటి నిర్ల‌క్ష్య‌పు తుప్పు వ‌ద‌ల‌డం లేదు. తూతూ మాత్రంగా ప్ర‌భుత్వం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. నామ‌కేవాస్తేగా ఫైన్ వేస్తూ త‌ప్పును క్యాష్ చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లకు కొదువేలేదు. అయినా ప్రైవేట్ ఆస్ప‌త్రుల నిర్ల‌క్ష్యం మార‌డం లేదు.
నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చికిత్సపొందుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో మృతి చెందాడు. పూర్తి బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామని ఆస్పత్రి తేల్చి చెప్పడంతో మృతుడి బంధువులు అప్పో స‌ప్పో చేసి రూ.10లక్షలు తెచ్చి చెల్లించారు. కానీ ఆస్ప‌త్రి నిర్ల‌క్ష్యం కార‌ణంగా వేరే వ్య‌క్తి మృత‌దేహాన్ని అప్ప‌గించారు. క‌నీసం మొఖం అన్న చూపెట్ట‌మ‌ని ప్రాధేయ‌ప‌డినా కోవిడ్ నిబంధ‌న‌ల పేరిట స‌సేమిరా అన్నారు. తీరా అంత్య‌క్రియ‌లకు ఏర్పాటు చేసి చితికి నిప్పు పెట్టే చివ‌రి క్ష‌ణంలో మృత‌దేహాం మారింద‌ని అంబులెన్స్ సిబ్బంది చెప్ప‌డంతో బంధువులు అవాక్కయ్యారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ ఫోన్‌ చేసి చెప్పకపోతే ఆ రెండు సెకెన్లలోనే చితికి నిప్పుపెట్టేవాళ్లమని.. రూ.10లక్షలు బిల్లు కట్టినా నిర్లక్ష్యంతో వేరే మృతదేహం అప్పగించారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img