న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇయ్యాలంటే అయ్యే ఖర్చు రూ. 80 వేల కోట్లు. ఇదేదో అల్లటప్పాగా వేసిన లెక్కలు కావు. కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగస్వామి అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కట్టిన అంచనా. శనివారంనాడు ఆయన ట్వీట్ చేశారు. పైగా ఇంత మొత్తం ఖర్చు పెట్టేందుకు ఇండియా సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించాడు. వచ్చే ఏడాదిలో ఇండియాకు ఇది సవాలుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్ తయారీలో ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ జెన్నెర్ ఇన్‌స్టిట్యూట్, ఆస్ట్రాజెనికాతో ఇండియా భాగస్వామ్యం కలిగి ఉంది. పుణెకు చెందిన ఎస్ఐఐ 17 దేశవ్యాప్తంగా 17 ట్రయిల్ సైట్స్‌లో పరీక్షలు జరుపుతోందని పూనావాలా మరో ట్విట్‌లో వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు విదేశాలతోనూ తగిన వ్యూహం, గైడెన్స్ అనుసరించాల్సి ఉంటుందన్నారు.
ఇటీవలే రష్యా డెరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కలిసి ఇండియాలో ‘స్పుట్నిక్ వి వ్యాక్సిన్’ క్లినికల్ ట్రయిల్, పంపిణీ విషయంలో సహకరించుకునేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.
120 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్… ఖర్చెంతవుతుందో తెలుసా..
RELATED ARTICLES