CP Ranganath vs mp bandi sanjay:
తప్పు నేను చేయలేదు …. లేదు లేదు నేను చేసింది కరెక్ట్ . వరంగల్ పోలీస్ కమి షనర్ రంగనాథ్ కి ..బీజేపీ తెలంగాణ చీప్ బండి సంజయ్ కు మద్య జరుగుతున్న మాటల యుద్ధం ప్రస్తుతం రాష్ట్రంలో ట్రెండ్ గా మారింది . పదవ తరగతి పరీక్ష పేపర్స్ లీకేజీ లేదా మాల్ ప్రాక్టీస్ గా పిలువబడుతున్న వ్యవహారంలో ప్రభుత్వ డైరెక్షన్ లో సీపీ అత్యుత్సాహం చూపించాడని బండి సంజయ్ ఆరోపించారు . ఎమ్మెల్యే , న్యాయవాది రఘునందన్ రావు కూడా సీపీ పై మండి పడ్డాడు . సంజయ్ ను అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని సీపీ ని విమర్శించారు
సవాల్ ..ప్రతి సవాల్ ఇవే
పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఇరుక్కున్నామనే ఉక్రోషంతో బీజేపీ నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ఇంతకాలం చేయని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు చేస్తు్న్నారని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. నిందితులుగా ఉన్న వాళ్లు దర్యాప్తును తప్పు పట్టడం కామన్ అని చెప్పారు. వరంగల్ లో అనేక కేసుల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా అరెస్టు అయ్యారని తెలిపారు. బండి సంజయ్ ని ఆశ్రయించిన బాధితులు…తన వల్ల కేసుల పాలైన రౌడీలు, భూ కబ్జాదారులు, పీ.డీ యాక్ట్ బాధితులు, ఇతర నేరాలకు పాల్పడిన వారు ఉండవచ్చన్నారు. తాను నల్గొండ, ఖమ్మంతో పాటు..ఏపీలో అనేక ప్రాంతాల్లో డ్యూటీ చేశానని సీపీ రంగనాథ్ తెలిపారు. తాను ఎక్కడ చేసినా ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. తన కెరీర్లో ఒక్క దందా చేసినా..సెటిల్ మెంట్ చేసినట్లు నిరూపించినా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో చాలామంది మెసేజ్ పంపారని..వారందరిని విచారణకు పిలుస్తున్నామన్నారు. మీడియా వాళ్ళను కూడా విచారణకు పిలుస్తున్నామని చెప్పారు.సత్యం బాబు కేసుపై బండి సంజయ్ కు పూర్తి అవగాహన లేనట్లుందని చురకలంటించారు. ఆ కేసును దర్యాప్తు చేసింది తాను కాదన్నారు. తాను ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వచ్చానని, ప్రతీ సారి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదన్నారు. చేయమంటే ప్రమాణం చేసేందుకు సిద్దమన్నారు.
సీపీ మీద బండి సంజయ్ విమర్శలు
ఈటల రాజేందర్ కు ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఆయన చేసిన తప్పేముంది? దమ్ముంటే ఆధారాలు చూపించు. మాట్లాడితే ఫోన్ అంటున్నారు. కరీంనగర్ లో నన్ను అరెస్ట్ చేసినప్పటి నుండి సిద్దిపేట వరకు ఫోన్ ఉంది. నా పీఏ, నేను కూడా పోలీసుల అదుపులోనే ఉన్నం. ఫోన్ ను వాళ్లే తీసుకుని నాటకాలాడుతున్నరు. నా ఫోన్ ను సీఎం చూసిన తరువాత చక్కెరొచ్చి పడిపోయిండట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల కాల్ లిస్ట్ చూసి ఇంతమంది టచ్ లో ఉన్నారా? అని విస్తుపోయింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ భాగోతమంతా తీస్తున్నా. విజయవాడ సత్యబాబు కేసు మొదలు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సంపాదించిన ఆస్తులు, అక్రమాలన్నీ వెలికితీస్తున్నా. అమాయకులపై కేసులు పెట్టి, సంబంధం లేని వ్యక్తులను రిమాండ్ కు పంపడానికి నీకు ఎవరు అధికారమిచ్చారు? నీకు దమ్ముంటే నీ ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టు. నువ్వు సీఎంతో, మంత్రులతో ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు ఈ కేసు గురించి మాట్లాడినవో తెలుస్తుంది