HomeతెలంగాణCPI:సీపీఐకి 30 సెగ్మెంట్లలో బలముంది

CPI:సీపీఐకి 30 సెగ్మెంట్లలో బలముంది

– కేసీఆర్​ నమ్మించి మోసం చేశారు
– ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ఇదేనిజం, హైదరాబాద్​: సీపీఐకి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 30 సెగ్మెంట్లలో బలముందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు. గురువారం ఆయన హైదరాబాద్​ లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్​ తమను అవమానించారని ఆరోపించారు. ఒక్కసీటు ఇస్తామని ఆఫర్​ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతోనే తాము బీఆర్ఎస్​ కు సపోర్ట్​ చేశామని చెప్పారు. సీపీఐకి రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో బలమైన ఓటుబ్యాంకు ఉందని చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img