Homeహైదరాబాద్latest Newsఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

– హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ & కోహెడ ఎస్సై తిరుపతి

ఇదే నిజం, కోహెడ : కోహెడ మండల పరిధిలోని మోయతుమ్మెద వాగు నుండి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో ఎస్‌ఐ తిరుపతి తమ సిబ్బందితో శుక్రవారం ఉదయం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తంగళ్లపల్లి గ్రామానికి చెందిన చొప్పరి సంపత్, చొప్పరి లింగం, చొప్పరి శ్రీకాంత్, బిగుళ్ల నరేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారు తంగళ్లపల్లి గ్రామ మోయతుమ్మెద వాగు నుండి 4 ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పట్టుబడ్డారు. వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేశామని, వారు వినియోగిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశామని ఎస్‌ఐ తెలిపారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచామని, ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి, వారి వాహనాలను సీజ్ చేస్తామని, అనంతరం వారిపై చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img