బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే బాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పడింది. లేటెస్ట్గా ఈ మూవీ టైటిల్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘సికందర్’అనే క్రేజీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు సల్మాన్‌ఖాన్ తన ట్విట్టర్లో టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘ ఈసారి ఈద్‌కి ‘మైదాన్’, ‘బడేమియా చోటేమియా’లు వస్తే వచ్చే ఈద్‌కి ‘సికందర్’ మిమ్మల్ని కలుస్తాడు అంటూ సల్మాన్ తన మార్క్ పోస్ట్‌తో ఫ్యాన్స్‌కి మంచి అప్డేట్ అందించాడు. సికిందర్ సినిమాను సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.