నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తనట్లు తెలుస్తుంది. అయితే ఆ హీరో ఎవరు అంటే మాస్ మహా రాజ్ రవితేజ తన వాయిస్ ఓవర్‌తో బాలయ్య పాత్రను పరిచయం చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర గురించి వాయిస్ ఓవర్ వినిపిస్తోంది. రవితేజ ఈ వాయిస్ ఓవర్ చేయనున్నాడని టాక్ నడుస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ జనాలని అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగా కానుకగా జనవరి 12న థియేటర్లో రిలీజ్ కానుంది.