వరల్డ్ వైడ్‌గా మోస్ట్ పాపులర్ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్. అమెజాన్‌లో ఇంటర్నేషనల్ లెవెల్లో హిట్ అయిన వెబ్ సిరీస్‌లు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ‘ది బాయ్స్’. ఇప్పటివరకు మూడు సీజన్లు రాగా.. అన్నీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. దీంతో ది బాయ్స్ నాలుగో సీజన్‌పై మంచి క్రేజ్ నెలకొంది. ఈ సిరీస్ కోసం వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీజన్–4 పై అయితే ప్రైమ్ వీడియో లేటేస్ట్‌గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందించింది. ఈ సిరీస్‌ను 2024లో రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫార్మ్ చేసింది. దీంతో అయితే వచ్చే ఏడాదిలోనే ఈ సిరీస్ రిలీజ్‌ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ముందు రోజుల్లో అయితే ఈ సిరీస్ డేట్‌ను కూడా రివీల్ చేయాల్సి ఉంది.