తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో సైన్స్ కోర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మండలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండగా వీటిని 146కు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సబ్జెక్టు నిపుణులు, పలు వర్సిటీల సైన్స్ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీవోఎస్) చైర్మన్లతో త్వరలోనే సంప్రదింపులు జరపనుంది. దీంతో లైఫ్ సైన్సెస్ సహా ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి కోర్సుల్లో క్రెడిట్ల సంఖ్య తగ్గనుంది. అలాగే ప్రాక్టికల్స్ ను కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.