Homeహైదరాబాద్latest Newsస్టోయినిస్‌కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా

స్టోయినిస్‌కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా

మార్కస్‌ స్టోయినిస్‌ క్రికెట్ ఆస్ట్రేలియా మొండిచేయి చూపింది. 2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌ మార్కస్‌ స్టోయినిస్‌, ఇటీవలే టెస్ట్‌, వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్‌ అగర్‌, మార్కస్‌ హ్యారిస్‌, మైకేల్‌ నెసర్‌, మ్యాట్‌ రెన్‌షాల​కు కూడా క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్‌ లభించలేదు.

క్రికెట్‌ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్‌ కల్పించింది. జేవియర్‌ బార్ట్‌లెట్‌, నాథన్‌ ఇల్లిస్‌, మ్యాట్‌ షార్ట్‌, ఆరోన్‌ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్‌ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్‌లెట్‌ తొలిసారి కాంట్రాక్ట్‌ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్‌ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్‌ టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది.

క్రికెట్‌ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్‌, నాథన్‌ లయోన్‌, మిచెల్‌ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్‌సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

Recent

- Advertisment -spot_img