పాకిస్తాన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ ఎండ వేడిలో క్రికెట్ ఆడుతూ మైదానంలో కుప్పకూలి మరణించాడు. అడిలైడ్‌లో ఓల్డ్ కాన్కార్డియన్స్ , ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ ఓల్డ్ కొలీజియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ జరిగిన సమయంలో ఉష్ణోగ్రత 41.7 డిగ్రీలు ఉన్నట్లు తెలుస్తుంది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి క్రికెట్ ఆడుతూ జునైద్ జాఫర్ ఖాన్ మరణించాడని తెలుస్తుంది.