Homeక్రైంCrime : డబ్బుల కోసం నాయనమ్మను దారుణంగా తన్నిన మనువడు

Crime : డబ్బుల కోసం నాయనమ్మను దారుణంగా తన్నిన మనువడు

Crime :

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో హృదయ విధారకరమైన ఘటన చోటుచేసుకుంది……
తన ఇంట్లో ఉంటూ తనకు పెన్షన్ డబ్బులు ఇస్తలేదని సొంత నాయనమ్మను అత్యంత దారుణంగా కాళ్లతో తన్నుతూ, విపరీతంగా కొడుతూ మనుమడు సింది గోవర్ధన్ గాయపరిచాడు ప్రతి నెల నెల మంబాపూర్ గ్రామానికి చెందిన సింధి యాదమ్మకు వృద్ధాప్య పింఛన్ కింద ప్రతినెల 2,016 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం తరఫున వస్తున్నాయి. వీటిని తనకు ఇవ్వాలని వృద్ధురాలు అని కూడా చూడకుండా దారుణంగా వీపు మీద తన్నాడు. ఇది చూస్తూ అక్కడ. ఉన్నవాళ్లు అడ్డుకోలేదు సరికదా వీడియో తీస్తూ నిలబడి పోయారు. వృద్దురాలి పరిస్థితి విషమంగా ఉంది.ఈ సంఘటనతో మంబాపూర్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలాన్ని నేడు ఉదయం పోలీసులు పరిశీలించారు. జరిగిన సంఘటనపై సర్పంచ్ శ్రావణ్ కుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డిలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై పలువురు నాయనమ్మను దారుణంగా కొట్టిన మనవడు గోవర్ధన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు…

Recent

- Advertisment -spot_img