– బెంగూళూరులో మహిళా ఆఫీసర్మ ర్డర్ కేసులో వీడిన మిస్టరీ
– ఉద్యోగంలో నుంచి తొలగించిందనే కక్షతో తానే చంపినట్లు ఒప్పుకున్న కారు డ్రైవర్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: బెంగుళూరులో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఉద్యోగంలో నుంచి తొలగించిందనే కక్షతో కారు డ్రైవరే ఆమెను హత్య చేసినట్లు తేలింది. అయిదేళ్ల నుంచి కాంట్రాక్టు డ్రైవర్‌గా చేస్తున్న కిరణ్ అనే వ్యక్తిని ఇటీవల ఉద్యోగం నుంచి తీసివేశారు. తనను ఉద్యోగం నుంచి తీసివేసినందుకు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల ముందు కిరణ్ అంగీకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎస్ ప్రతిమ(45) కర్ణాటక రాష్ట్ర గనులు, భూగర్భ శాఖలో జియాలిజిస్ట్‌గా పనిచేస్తున్నారు. రామనగర జిల్లాలో పనిచేస్తున్న ప్రతిమ.. ఏడాది కిందట బదిలీపై బెంగళూరుకు వచ్చారు. దొడ్డకల్ల సంద్ర గోకుల్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆమె భర్త, కొడుకు శివమొగ్గలో ఉంటున్నారు. ప్రతిమ శనివారం రాత్రి డ్యూటీ అయిపోయిన తర్వాత రాత్రి 8 గంటల వరకు చేరుకున్నారు. కిరణ్ స్థానంలో కొత్తగా రిక్రూట్ అయిన డ్రైవర్ ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి 8 గంటల తర్వాత ఈ మర్డర్ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రతిమ గొంతును నిందితుడు కత్తితో కోసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెను హత్య చేసిన తర్వాత నిందితుడు కిరణ్ 200 కి.మీల దూరంలో ఉన్న చామరాజనగర్‌కు పరారీ అయినట్లు గుర్తించారు. శివమొగ్గలో మాస్టర్స్ డిగ్రీ చదివిన ప్రతిమ డైనమిక్ లేడీ అని ఆ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఆమె కొన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేశారని, ఆమెకు ఎవరూ శత్రువులు లేరని, మంచి పేరు సంపాదించుకున్నదని ఆయన తెలిపారు.