Homeహైదరాబాద్latest NewsCrime News : ఆబ్కారీ అధికారుల మెరుపుదాడి

Crime News : ఆబ్కారీ అధికారుల మెరుపుదాడి

రూ.20లక్షల డ్రగ్స్ పట్టివేత

ఇదేనిజం ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో ఎక్సైజ్​శాఖ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. రూ.20 లక్షల నిషేధిత డ్రగ్స్ ను అబ్కారీ శాఖ అధికారులు సీజ్​ చేశారు. గురువారం నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని ఇంటర్నేషనల్ హోటల్ వద్ద నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీ సమయంలో ఓ కారులో అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తి ని తనిఖీ చేయగా ఆ వ్యక్తి బ్యాగ్ లో 2 కేజీల అల్ఫ్రాజోలం లభించింది. సదరు వ్యక్తిని విచారించగా రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా లాడ్ను గ్రామవాసి భవాని సింగ్ గా గుర్తించారు. ఆల్ఫాజోలంను రాజస్థాన్ లోని ముఖేష్ సింగ్ నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్ కుకట్ పల్లికి చెందిన సుదర్శన్ కు విక్రయించనున్నట్టు తెలిపారు. పోలీసులు కారు, రూ. 20 లక్షల వరకు విలువ గల 2 కిలో ల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img