– పోచారం ఐటీ కారిడార్లో ఘటన
– 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇదే నిజం, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కాలనీకి చెందిన యువకుడు (18), బాలిక (15) మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు యువకుడిని పలుమార్లు మందలించారు. బుధవారం తల్లిదండ్రులు బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి బయటకు వెళ్లారు. దీంతో రాత్రి బాలిక ఇంటికి యువకుడు వెళ్లాడు. గమనించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. రహస్య భాగాలపై కారం వేసి కొట్టారు. దాదాపు గంట సేపు చితకబాదడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.