Homeహైదరాబాద్latest NewsCrime News : అక్రమ మద్యం తరలిస్తున్నకారుకు ప్రమాదం

Crime News : అక్రమ మద్యం తరలిస్తున్నకారుకు ప్రమాదం

– మందుబాటిళ్లు వదిలేసి పారిపోయిన నిందితులు
– బిహార్​లో ఘటన

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: అక్రమ మద్యం తరలిస్తున్న ఓ కారుకు ప్రమాదం జరిగింది. దీంతో నిందితులు కారును, మద్యం సీసాలను వదిలేసి వెళ్లిపోయారు. కాగా స్థానికులు మద్యం బాటిళ్లను లూటీ చేశారు. ఈ ఘటన బిహార్​ లో చోటు చేసుకున్నది. ఆ కారులో విదేశీ మద్యాన్ని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బీహార్లోని పాట్నా రాజధాని ప్రధాని రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నది. వేగంగా వెళుతున్న ఆ కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో దారిన వెళ్లే వారు సాయం చేసేందుకు వచ్చారు. అప్పటికే అందులో ఉన్న వారు కారును వదిలి పారిపోయారు. అయితే.. లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో అక్కడున్నవారు వాటిని తీసుకుని పరుగులు పెట్టారు. అది చూసి మరికొందరు కారు వద్ద గుమిగూడడంతో రహదారిపై గందరగోళ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం బిహార్ లో మద్య నిషేధం అమలవుతున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img