Homeక్రైంCrime News : బిడ్డ, అల్లుడిపై కత్తితో దాడి

Crime News : బిడ్డ, అల్లుడిపై కత్తితో దాడి

– కుమార్తె మృతి.. అల్లుడి పరిస్థితి విషమం
– ఆస్తి తగదాలే కారణం
– ఖమ్మం జిల్లా వైరాలో ఘటన

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి తన కుమార్తె, అల్లుడిపై గడ్డ పారతో దాడి చేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా.. అల్లుడి పరిస్థితి విషమంగా ఉంది. వైరా ఎస్సై మేడా ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం తాడిపూడి గ్రామానికి చెందిన రాములు కుమార్తె ఉష(28), అల్లుడు రామకృష్ణపై శుక్రవారం ఉదయం దాడి చేశాడు. దీంతో ఉష (28) ఘటనాస్థలంలోనే మృతిచెందింది. రామకృష్ణ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు రాములు పరారీలో ఉన్నాడన్నారు.

Recent

- Advertisment -spot_img