– ఒకరి మృతి.. ఏడుగురికి గాయాలు
ఇదే నిజం, హైదరాబాద్: చైతన్యపురి రాజీవ్‌గాంధీనగర్ వద్ద ఆదివారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు అదుపుతప్పి కమాన్ దిమ్మెను ఢీకొట్టడంతో కారులో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎల్బీనగర్ – ఉప్పల్ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన యువకుడు చౌటుప్పల్ ఎమ్మార్వో కుమారుడని సమాచారం.