Homeక్రైంCrime News: He escaped with Rs.18.5 lakhs by claiming to be the...

Crime News: He escaped with Rs.18.5 lakhs by claiming to be the police Crime News : పోలీసులమని చెప్పి రూ.18.5 లక్షలతో పరార్​

– తనిఖీల పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసిన దారి దోపిడి దొంగలు
– జూబ్లీహిల్స్​ పీఎస్​ పరిధిలో ఘటన

ఇదే నిజం, హైదరాబాద్: పోలీసుల ముసుగుతో కొందరు దారి దోపిడి దొంగలు తనిఖీలు నిర్వహించి రూ.18.5 లక్షల క్యాష్​తో పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సురేశ్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి మెహదీపట్నంలో గత కొన్నేళ్లుగా క్లాత్ స్టోర్​ను నడుపుతున్నారు. అతని దగ్గర పనిచేసే ప్రదీప్‌ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రూ.20 లక్షల క్యాష్​ను తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పోలీసు డ్రెస్​లో ఉన్న కొందరు వ్యక్తులు జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌ సమీపంలో ప్రదీప్ కారును ఆపాడు. తనిఖీలు చేస్తున్నట్లుగా నటించాడు. ఆపై కారులో ఉన్న రూ.20 లక్షల్లో రూ.18.5 లక్షలు తీసుకుని. మిగతా రూ.1.5 లక్షలు అతని చేతిలో పెట్టి పరారయ్యారు. ప్రదీప్‌ ఇచ్చిన కంప్లయింట్​ మేరకు పోలీసులు కేసుఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img