Homeక్రైంCrime News : బాలుడి కిడ్నాప్‌కు యత్నం

Crime News : బాలుడి కిడ్నాప్‌కు యత్నం

ఇదేనిజం, జగిత్యాల : పట్టపగలే బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల పట్టణంలోని వాణినగర్‌కు చెందిన కొక్కుల గోపి, శైలజ దంపతుల కుమారుడు రాజు (12) ఇంటి బయట గాలిపటం ఎగురవేస్తుండగా అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. బాలుడికి మాయమాటలు చెప్పి కొత్త బస్‌స్టాండ్‌ వరకు తీసుకువెళ్లాడు. విషయాన్ని గ్రహించిన స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్‌ అలీగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా చర్చానీయంశంగా మారింది.

Recent

- Advertisment -spot_img