Homeక్రైంCrime News : వైరా రిజర్వాయర్ వద్ద ప్రేమ జంట ఆత్మహత్య

Crime News : వైరా రిజర్వాయర్ వద్ద ప్రేమ జంట ఆత్మహత్య

– ఖమ్మం జిల్లాలో ఘటన

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మ జిల్లా వైరాలో జరిగింది. బోనకల్‌ మండలం రాపల్లెకు చెందిన చింతల సుమంత్‌(20), బ్రాహ్మణపల్లికి చెందిన 17 ఏళ్ల మైనర్‌ బాలిక శుక్రవారం వైరా రిజర్వాయర్‌ కింది భాగంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమవ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ కన్పించడం లేదని బోనకల్‌ పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

Recent

- Advertisment -spot_img