Homeహైదరాబాద్latest NewsCrime News : ప్రైవేటు బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు

Crime News : ప్రైవేటు బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు

– ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘటన

ఇదే నిజం, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. గుడిపాల మండలంలోని చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సికింద్రాబాద్‌కు చెందిన లలిత (65), తమిళనాడులోని మానియంబాడికి చెందిన కుబేంద్రన్‌(35) తీవ్రంగా.. మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డవారికి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img