Homeక్రైంCrime News : పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ అరెస్ట్

Crime News : పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ అరెస్ట్

– బహిరంగ సభలో మాట్లాడుతుండగానే కస్టడీలోకి తీసుకున్న ఈడీ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జశ్వంత్‌ సింగ్‌ గజ్జన్‌మజ్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) సోమవారం అరెస్టు చేసింది. మలేర్‌కోట్లా జిల్లాలోని అమర్‌గఢ్‌లో ఈ ఉదయం ఆయన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా.. అక్కడకు వచ్చిన ఈడీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. గతేడాది నమోదైన ఓ మనీ లాండరింగ్‌ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయనను మొహాలీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. లూదియానాలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ గతేడాది జశ్వంత్‌ సింగ్‌కు చెందిన ఓ కంపెనీపై ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీ తమ బ్యాంకుకు రూ.41కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ గతేడాది సెప్టెంబరులో.. జశ్వంత్‌ నివాసంతో పాటు ఆయన కుటుంబం నిర్వహించే స్కూలు, ఆఫీసులు, ఓ ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.16.57లక్షల నగదు, విదేశీ కరెన్సీ, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఇటీవల జశ్వంత్‌కు ఈడీ నాలుగుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే, వాటిని ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ అరెస్టును ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి మాల్విందర్‌ కాంగ్ తీవ్రంగా ఖండించారు. బహిరంగ సభ నుంచి ఆయనను బలవంతంగా కస్టడీలోకి తీసుకోవడం దారుణమని మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img