Homeఫ్లాష్ ఫ్లాష్Crime News : చిన్నారిపై SI లైంగికదాడి

Crime News : చిన్నారిపై SI లైంగికదాడి

– రాజస్థాన్​లో ఘటన

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: రాజస్థాన్​ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకున్నది. చిన్నారిపై ఓ ఎస్సై లైంగికదాడికి తెగబడ్డాడు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. రహువాస్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న భూపేంద్ర సింగ్‌ డ్యూటీ సమయంలోనే అతడు తన సహోద్యోగి అద్దె గదికి వెళ్లాడు. పక్కనే ఉంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ అతడున్న రూం వద్దకు వచ్చింది. చిరుతిళ్లు ఇస్తానని ఆశజూపి ఆ బాలికను తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి వివరించడంతో విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img