Homeహైదరాబాద్latest NewsCrime News : ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..

Crime News : ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..

– దూరం పెడుతున్నదని ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు

కొంతకాలంగా అతడికి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ప్రేమించిన యువతిని హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశకు చెందిన రిషబ్ నిగమ్-వందన మధ్య పదేళ్లుగా ప్రేమలో వున్నారు. ప్రస్తుతం ఆమె పుణెలోని హింజావాడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. అతడికి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తోందని రిషబ్ మనస్తాపానికి గురయ్యాడు. ఆమెపై అనుమానం పెంచుకొని.. హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ప్రియురాలిని కలిసేందుకు పుణెకు వచ్చి ఓ హోటల్లో గదిని బుక్ చేశాడు. ఈ క్రమం లో వందనను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ముంబయికి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ సీసీటీవీ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img