Homeక్రైంCrime News : లాడ్జిలో జంట హత్యల కలకలం

Crime News : లాడ్జిలో జంట హత్యల కలకలం

– మహిళను హతమార్చి ..ఆపై వ్యక్తి ఆత్మహత్య

– కర్నూలులో ఘటన

– వివాహేతర సంబంధమే కారణం

ఇదేనిజం, ఏపీబ్యూరో : వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను హతమార్చి ..ఆపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి కర్నూలు మూడో పట్టణ సీఐ మురళీధర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉండే విజయ్‌కుమార్‌ (35) ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేసేవాడు. తన ఇంటికి సమీపంలో నివాసం ఉండే ఓ మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై సదరు మహిళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇద్దరు కలిసి కర్నూలుకు వచ్చారు. పట్టణంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసున్నారు. శనివారం ఉదయం ఇద్దరూ ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టారు. గదిలో ఇద్దరు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. మహిళ మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో విజయ్‌కుమార్‌.. సదరు మహిళను కత్తితో పొడిచి అనంతరం అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Recent

- Advertisment -spot_img