ఇదేనిజం, ఖమ్మం : ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని సాకేత్ కృష్ణ హాస్పిటల్ సమీపంలో జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ మొబైల్ షాప్‌లో గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. వైరాలో పరిధిలోని బ్రాహ్మణపల్లి కాలనీకి చెందిన రామకృష్ణ భూమాత వారి సాకేత్ కృష్ణ హాస్పిటల్ పక్కనే ఉన్న ఓ దుకాణాన్ని అద్దెకి తీసుకొని మొబైల్ షాప్, ఇంటర్నెట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి షాప్ వెనుక భాగంలో ఉన్న డోర్‌ను దొంగలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. షాపులోని రూ.20 వేల నగదుతో పాటు 80 వేల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లు, సెల్ ఫోన్ల విడి పరికరాలు చోరీ చేశారు. మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చిన రామకృష్ణ చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వైరా ఎస్ఐ వంశీకృష్ణ భాగ్యరాజు చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలించారు. క్లూస్ టీం నిపుణులు చోరీ జరిగిన దుకాణంలో వేలిముద్రలను సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.